నెమ్మదిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  పోలింగ్

నెమ్మదిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  పోలింగ్ NOVEMBER 11 ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభ రెండు గంటల్లో ఓటింగ్ నెమ్మదిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు కేవలం 9.2 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటున వందమంది వరకు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ వేగం నెమ్మదిగా ఉన్నప్పటికీ, సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉన్నందున, మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం పెరగొచ్చని ఎన్నికల అధికారులు అంచనా…

Read More
బీజేపీ, బీఆర్‌ఎస్ దుష్ప్రచారాలపై మండిపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

బీజేపీ, బీఆర్‌ఎస్ దుష్ప్రచారాలపై మండిపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రాజకీయ వేడి చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి”నవీన్ యాదవ్” మాట్లాడుతూ, తమ కుటుంబం ఈ ప్రాంత ప్రజలతో గత 40 ఏళ్లుగా గాఢమైన అనుబంధం కలిగి ఉందని తెలిపారు. సహాయం కోసం వచ్చిన వారందరికీ అండగా నిలిచామని, అందుకే ప్రజలు తనను సెక్యులర్ నాయకుడిగా భావిస్తున్నారని చెప్పారు.2014లో MIM తరఫున పోటీ చేసినప్పుడు కూడా ప్రజలు తనను విశ్వసించి రెండో స్థానంలో నిలిపారని గుర్తుచేశారు. Also Read:Kurnool:కర్నూలు జిల్లాలో…

Read More
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌ దిశానిర్దేశం 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేసారు.ప్రచారం ముగియకముందే ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలవాలని, ఈ మూడు రోజులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులకు సూచించారు. ప్రచారం 9న ముగియనుండటంతో ఒక్క రోజును కూడా వృథా చేయకూడదని స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన సమీక్షలో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు….

Read More
బండి సంజయ్‌

బోరబండలో బండి సంజయ్‌ సభకు పోలీసులు అనుమతి రద్దు – భాజపా ఆగ్రహం

బోరబండలో బండి సంజయ్‌ సభకు పోలీసులు అనుమతి రద్దు చేశారు. ఈ నిర్ణయంతో భాజపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తొలుత అనుమతిచ్చి తర్వాత రద్దు చేయడం అన్యాయం అని పార్టీ నాయకులు మండిపడ్డారు.కాంగ్రెస్‌ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గారనే ఆరోపణలు చేశారు. భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జి ధర్మారావు మాట్లాడుతూ, బండి సంజయ్‌ సభను ఏ పరిస్థితుల్లోనైనా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బోరబండకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా…

Read More
Ponnam Prabhakar addressing media about Jubilee Hills by-election

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పొన్నం ప్రభాకర్ విరుచుకుపాటు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్‌ రెడ్డి మాటలు జోక్‌లా ఉన్నాయంటూ విమర్శించిన ఆయన,గత ఎన్నికల్లో వచ్చిన 25 వేల ఓట్లు ఈసారి 10 వేలకీ చేరవని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపిస్తూ, ఇరుపార్టీల నిజ స్వరూపం బయటపడిందన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా 10 ఏళ్లుగా ఉన్న కిషన్‌ రెడ్డి జూబ్లీహిల్స్ అభివృద్ధి…

Read More

పేరులో జూబ్లీహిల్స్ – వాస్తవంలో బస్తీల నియోజకవర్గం

రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గురించి ఓ ఆసక్తికరమైన అంశం వెలుగుచూసింది. పేరులో “జూబ్లీహిల్స్” ఉన్నా, వాస్తవానికి ఆ ప్రసిద్ధ ప్రాంతం ఈ నియోజకవర్గ పరిధిలో లేదన్నది చాలా మందికి తెలియని నిజం. అందరికీ గుర్తొచ్చే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ధనవంతులు నివసించే అసలు జూబ్లీహిల్స్ ప్రాంతం ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మాత్రం షేక్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహ్మత్‌నగర్, వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ అనే ఏడు…

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: నేటితో నామినేషన్ గడువు ముగిసింది – 150కి పైగా అభ్యర్థులు బరిలో

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రాజకీయ వేడి పుట్టిస్తోంది. ఈరోజుతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉండగా, ఆ సమయానికి ఎన్నికల కార్యాలయ గేటు లోపల ఉన్న అభ్యర్థులకు చివరి నిమిషంలో నామినేషన్ దాఖలుకు అధికారులు అవకాశం కల్పించారు. దీనివల్ల భారీ సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్,…

Read More