98వ ఆస్కార్ వేడుకకు నూతన నిబంధనలు
చలన చిత్ర ప్రపంచంలో అత్యున్నత గౌరవంగా భావించే ఆస్కార్ అవార్డుల 98వ వేడుకకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వెల్లడించింది. ఈ వేడుక 2026 మార్చి 15న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. ఆస్కార్ పోటీ కోసం ఎంపికయ్యే చిత్రాలను 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య విడుదలైనవిగా ప్రకటించారు. అయితే మ్యూజిక్ విభాగానికి మాత్రం గడువు 2024 అక్టోబర్ 15గా నిర్ణయించారు. ఈసారి ఆస్కార్ నామినేషన్ల…
