హైకింగ్‌లో అనుకోని బంగారు నిధి లభ్యం
పర్వతాల్లో హైకింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడం కొన్ని సార్లు ఊహించని అనుభవాలకు దారితీస్తుంది. చెక్ రిపబ్లిక్‌లోని పోడ్కర్కోనోసి పర్వతాల్లో ఫిబ్రవరిలో ఇద్దరు హైకర్లు ప్రయాణిస్తున్నప్పుడు, వారు అనుకోకుండా శతాబ్దాల నాటి బంగారు నిధిని కనుగొన్నారు. ఇది దేశం ఉత్తరాన ఉన్న ఈశాన్య ప్రాంతంలో చోటు చేసుకుంది. వారు హైక్ చేస్తూ నడుస్తుండగా కొన్ని అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. దగ్గరగా వెళ్లి పరిశీలించగా, అక్కడ పాతకాలం నాటి బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు బయటపడ్డాయి. వెంటనే…
