భారత స్టాక్ మార్కెట్లలో కొత్త గరిష్ఠాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతానికి పెంచుతూ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సవరించడం… మరోవైపు అమెరికా జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండడంతో లాభాల బాటలో పయనిస్తున్న గ్లోబల్ మార్కెట్లను అనుసరిస్తూ.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ (శుక్రవారం) పైపైకి పరుగులు పెడుతున్నాయి. ఆగస్టు నెలలో చివరి ట్రేడింగ్ రోజు అయిన నేడు మార్కెట్లు చక్కటి లాభాలతో ఆరంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 0.61 శాతం లేదా 502 పాయింట్లు పెరిగి 82,637.03…
