
మహీంద్రా విక్రయాలు పెరుగుదల, టాటా తగ్గుదల
మహీంద్రా & మహీంద్రా వాహనాలకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉండటం ఫలితంగా అక్టోబర్‌లో కంపెనీ అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేసింది. కంపెనీ 96,648 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. గత ఏడాది ఇదే కాలంలో 80,679 యూనిట్లతో పోలిస్తే 20 శాతం పెరిగిందని తెలిపారు. యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో, 54,504 యూనిట్లు విక్రయించిన మహీంద్రా, ఇది గత సంవత్సరం 43,708 యూనిట్లతో పోలిస్తే 25 శాతం పెరిగినట్లుగా ప్రకటించింది. కంపెనీ మరింతగా ఎగుమతులతో సహా…