
తెలంగాణలో 2026 వరకు ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త అందించింది. 2026 చివరి దాకా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్ మినహాయింపును ప్రకటించింది. అదే విధంగా రిజిస్ట్రేషన్ ఫీజును 100 శాతం తగ్గించే నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విధానం రాష్ట్రంలో కాలుష్య నియంత్రణను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించబడింది. గత పరిమితులను తొలగించి, రెండేళ్ల పాటు పన్ను మినహాయింపును పొడిగిస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన ప్రకారం, సోమవారం…