కోల్‌కతా హత్యాచార ఘటనలో సంచలన విషయం
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా సంజయ్ రాయ్‌కి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు బాధితురాలిపై దారుణానికి పాల్పడే ముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి సంజయ్ రాయ్ పూటుగా మద్యం తాగి, మరో సివిక్…