అమెరికాలో భారతీయ వైద్యుడి నీచ చర్యలు బహిర్గతం
అమెరికాలో ఓ భారతీయ వైద్యుడు అత్యంత నీచమైన పనికి పాల్పడ్డాడు. పనిచేస్తున్న ఆసుపత్రుల్లో రహస్యంగా కెమెరాలు అమర్చి చిన్నారులు, మహిళల నగ్న చిత్రాలు, వీడియోలను రికార్డు చేశాడు. కొన్నేళ్లపాటుగా సాగుతున్న ఈ వ్యవహారం అతడి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. రికార్డు చేసిన వీడియోలను అతడు తన ఇంట్లోని కంప్యూటర్, ఫోన్లతోపాటు 15 ఎక్స్‌టర్నల్ స్టోరేజీ డివైజ్‌లలో భద్రపరిచాడు. ఒక సింగిల్ హార్డ్ డ్రైవ్‌లోనే ఏకంగా 13 వేల వీడియోలు ఉండడం చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. క్లౌడ్…