నందమూరి వారసురాలు తేజస్విని ఎంట్రీ – జ్యువెలరీ యాడ్‌తో తెరపైకి బాలయ్య చిన్న కుమార్తె
నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు వినోద రంగంలో అడుగుపెట్టింది. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తొలిసారి కెమెరా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్’ ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటనకు సంబంధించిన కమర్షియల్ యాడ్ వీడియో ఇప్పటికే విడుదలైంది. తేజస్విని హుందాతనంతో, సంప్రదాయబద్ధమైన అందంతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు తన తండ్రి సినిమాలకు సంబంధించిన నిర్మాణ పనుల్లో తెరవెనుక పనిచేసిన…
