ఏపీ టూరిజం బస్సులో బాలికకు లైంగిక వేధింపులు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన బస్సులో మైనర్ బాలిక లైంగిక వేధింపులకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. ఈ నెల 14న తిరుపతి నుంచి కోయంబత్తూర్ వెళ్లేందుకు బయలుదేరిన ఏపీ టూరిజం బస్సులో ఈ అమానుష ఘటన జరిగినట్లు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తన కుమార్తెను ఓ అనధికారిక ప్రయాణికుడు వేధించాడని ఆయన పేర్కొన్నారు. బస్సు సిబ్బంది అనధికారికంగా ప్రయాణికులను ఎక్కించారని, బస్సులోని సీసీ కెమెరాలు…
