ఒడిశా సరిహద్దులో మావోయిస్టు నేత చంద్రహాస్ మృతి
ఒడిశా సరిహద్దులోని గరియాబాద్ ప్రాంతంలో భద్రతా బలగాలు చేపట్టిన ఎన్‌కౌంటర్‌లో మరో మావోయిస్టు కీలక నేత మృతి చెందాడు. తెలంగాణకు చెందిన సీనియర్ మావోయిస్టు నాయకుడు అల్వాల్ ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ ఎదురుకాల్పుల్లో మరణించినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఆయన ఒడిశాతో పాటు ఈస్ట్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మృతి చెందిన చంద్రహాస్‌పై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా యాప్రాల్ జవహర్ నగర్‌కు చెందిన ఆయన 1985 నుంచి…
