ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ క్రైమ్ నియంత్రణకు కొత్త చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అరికట్టేందుకు ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, సైబర్ నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఈ నేరాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లలు, వృద్ధులపై లైంగిక దాడుల కేసులు పెరిగిపోతున్నాయని డీజీపీ పేర్కొన్నారు….
