సమస్యల పరిష్కారానికి కిమిడి నాగార్జునకు వినతిపత్రం
విజయనగరం జిల్లా వివిధ మండలాలకు చెందిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను కలిశారు. గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించారు. అనంతరం ఈ సమస్యలపై కిమిడి నాగార్జున స్పందించి, పరిష్కారం కోసం కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ మండలంలో ముస్లిం వర్గానికి శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరు, చౌడువాడ పంచాయితీలో 3 ఫేస్ విద్యుత్ అందుబాటులోకి తేవడం,…
