Thick smoke covers the Kailasagiri ropeway route. Officials are investigating, but the exact cause remains unknown.

కైలాసగిరి రోప్‌వే మార్గంలో దట్టమైన పొగలు!

విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి రోప్‌వే మార్గంలో గురువారం సాయంత్రం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటన స్థానికులను, పర్యాటకులను ఆందోళనకు గురిచేసింది. అయితే, పొగలు ఏర్పడడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత శాఖల అధికారులు స్పందించి, రోప్‌వే మార్గాన్ని పరిశీలిస్తున్నారు. పొగలు సహజంగా ఏర్పడ్డవా లేక ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు…

Read More
Former MLA Vasupalli Ganesh provided ₹10,000 medical aid to YSRCP leader Adapa Shiva as part of his welfare activities.

దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ సేవా కార్యక్రమం

దక్షిణ నియోజకవర్గ ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ, వారికి సేవ చేయడం తన ధర్మంగా తీసుకున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన సహాయ హస్తాన్ని అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా, ప్రమాదంలో కాలుఫ్రాక్చర్ అయిన వైసీపీ 29వ వార్డ్ సీనియర్ నాయకుడు అడపా శివకు మెడికల్ ఖర్చుల కోసం రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. వైసీపీ శ్రేణులతో కలిసి వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా…

Read More
Gajuwaka police arrested 57 people for open drinking in a special drive, registered cases, and sent them to court.

గాజువాకలో ఓపెన్ డ్రింకింగ్ పై స్పెషల్ డ్రైవ్, 57 మంది అరెస్ట్

గాజువాక పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం గాజువాక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ డ్రింకింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలను సిఐ పార్థసారథి నేతృత్వంలో ఎస్సైలు రాధాకృష్ణ, రవికుమార్, మన్మధరావు, నజీర్, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న 57 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిని గాజువాక పోలీస్ స్టేషన్ కు తరలించి, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు….

Read More
NASSCOM and AP Government to jointly host a career fair at GITAM University, Visakhapatnam, on March 5 and 6.

విశాఖ గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6న కెరీర్ ఫెయిర్

విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీల్లో నాస్కామ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా భారీ కెరీర్ ఫెయిర్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో 49 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు పాల్గొని యువతకు దాదాపు 10,000 ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. నిరుద్యోగ యువతకు మంచి అవకాశంగా నిలవనున్న ఈ ఫెయిర్‌కు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ కెరీర్ ఫెయిర్‌కు సంబంధించిన పోస్టర్‌ను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్…

Read More
A massive fire broke out at Daddy LJ Grand Hotel near Daba Gardens, Visakhapatnam, with fire safety and police teams rushing to the scene.

విశాఖ డాడీ ఎల్ జె గ్రాండ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నం డాబా గార్డెన్ సమీపంలోని డాడీ ఎల్ జె గ్రాండ్ హోటల్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్‌లో మొత్తం 13 గదులుండగా, 9 గదుల్లో అతిథులు ఉన్నారని హోటల్ సిబ్బంది తెలిపారు. అగ్నిప్రమాదం గమనించిన వెంటనే హోటల్ సిబ్బంది అప్రమత్తమై ఫైరుసేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైరుసేఫ్టీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. టూ టౌన్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు…

Read More
A medical camp was organized in Gajuwaka with Rise Hospital’s support, attended by APIIC IL Commissioner A. Kishore as chief guest.

గాజువాకలో రైజ్ హాస్పిటల్ సహకారంతో మెడికల్ క్యాంప్

గాజువాక, ఆటోనగర్, ఏపీఐఐసీలో రైజ్ హాస్పిటల్ సహకారంతో మెడికల్ క్యాంప్ ఘనంగా నిర్వహించబడింది. ఈ క్యాంప్‌లో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా ఏపీఐఐసీ ఐల కమిషనర్ ఏ. కిషోర్ హాజరై, మెడికల్ క్యాంప్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఐల ఆటోనగర్ చైర్మన్ కే. సత్యనారాయణ రెడ్డి (రఘు), సెక్రటరీ చీకటి సత్యనారాయణ, ట్రెజరర్ పి. పద్మావతి…

Read More
Journalist safety is the government's responsibility, says NAJ Secretary Gantla Srinubabu. Petitions submitted statewide protesting attacks on journalists.

జర్నలిస్టుల రక్షణపై చట్టం అవసరం – గంట్ల శ్రీనుబాబు

జర్నలిస్టుల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం చేయాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. పాత్రికేయులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ మల్వాడా రామారావుపై టీడీపీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనను నిరసిస్తూ ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్…

Read More