నాయుడుపేటలో అంగన్వాడీల సమస్యలపై భారీ నిరసన
నాయుడుపేట ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రాజెక్ట్ కార్యదర్శి ఎన్. శ్యామలమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పి. మునిరాజా, శివకవి ముకుంద తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను పలుమార్లు కోరినా సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. అంగన్వాడీలు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్…
