ధనుర్మాసం కారణంగా తిరుమలలో సుప్రభాత సేవ రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభమైన నేపథ్యంలో టీటీడీ అధికారులు సుప్రభాత సేవలను రద్దు చేశారు. రేపటి నుంచి జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవలు నిలిపివేస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధనుర్మాసం ఘడియలు ఈరోజు ఉదయం 6.57 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యేక మాసంలో తిరుప్పావై నివేదనతో శ్రీవారి మేల్కొలుపు నిర్వహించనున్నారు. ధనుర్మాసం సందర్భంలో నెల రోజుల పాటు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తిరుప్పావై పఠనం నిర్వహిస్తారు. శ్రీవారి మేల్కొలుపు కార్యక్రమం సుప్రభాత…
