త్రాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమీక్షలో త్రాగునీరు, వడగాల్పులు, పీ-4 సర్వే, రీ సర్వే, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. వేసవిలో వడగాల్పులు అధికంగా ఉంటాయని, త్రాగునీటి సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందుగా గుర్తించాలని కలెక్టర్ సూచించారు. నీటి ఎద్దడి సమస్యను నివారించేందుకు…
