
స్వచ్ఛభారత్ కార్మికుల వేతనాల కోసం వినూత్న నిరసన
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వచ్ఛభారత్ కార్మికులు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సిఐటియూ ఆఫీస్ నుంచి ర్యాలీగా కాలేజ్ సర్కిల్ మీదుగా వస్తూ, కళా జ్యోతి సర్కిల్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన తెలిపారు. నిరసనలో మోకాళ్లపై నిలుస్తూ, పచ్చి గడ్డి తినడం ద్వారా వినూత్నమైన ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా, జెవి రమణ సిఐటియు మండల కన్వీనర్, టీ.అయూబ్ ఖాన్ మాట్లాడారు. 2019…