సాల్మాన్ పురం మినగల్లు గ్రామంలో స్కూల్ బస్సు బోల్తా
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని సాల్మాన్ పురం మినగల్లు గ్రామాల మధ్యంలో శ్రీ నికేతన్ పాఠశాల బస్సు కాలువలో బోల్తా పడింది. నెల్లూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఈ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని మినుగల్లు గ్రామం వైపు బయలుదేరింది. అయితే, రోడ్డుపై గుంతలు ఉన్న నేపథ్యంలో డ్రైవర్ బ్రేక్ వేసినప్పుడు స్టీరింగ్ కంట్రోల్ కాకపోవడంతో బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో సుమారు 25 మంది విద్యార్థులు, పలువురు గ్రామస్తులు ఉన్నారు. స్థానికులు…
