
గిద్దలూరులో గంజాయి విక్రయదారుల అరెస్టు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అర్బన్ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిద్దలూరు హర్బన్ సీఐ సురేష్ బృందం నిఘా ఉంచి వారిని పట్టుకుంది. ముగ్గురిలో ఒకరు గిద్దలూరు వ్యక్తి కాగా, మరో ఇద్దరు తెలంగాణకు చెందినవారని గుర్తించారు. వీరి వద్ద నుంచి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు మార్కాపురం డిఎస్పి యు నాగరాజు తెలిపారు. గిద్దలూరు ప్రాంతంలో గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు…