Karlapalem police offering sweets to helmet-wearing riders during road safety drive

Helmet Safety Awareness: హెల్మెట్ ధరించు.. స్వీట్ తిను

కర్లపాలెం పోలీసులు గురువారం వినూత్న విధానంతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సహజంగా రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకుని వెళ్లే వాహనదారులను ఆపి ఎవరు స్వీట్లు పెట్టరు. కానీ కర్లపాలెం పోలీసులు “హెల్మెట్ ధరించు.. స్వీట్ తిను“సత్యవతి పేట వద్ద రహదారి నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి వారికి మిఠాయిలు తినిపించి ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్నందుకు అభినందించారు. ALSO READ:హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు..తప్పిన ముప్పు అదేవిధంగా…

Read More
Andhra Pradesh CM Chandrababu Naidu inaugurates MSME parks across the state

ఆంధ్రప్రదేశ్‌లో 50 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులు – రూ.25,256 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం

ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ ముఖ్యమంత్రి “చంద్రబాబు నాయుడు” భారీ పారిశ్రామిక పండుగకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో ఏర్పాటు చేసిన “ఎంఎస్ఎంఈ పార్కును” ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా “17 జిల్లాల్లోని 50 ఎంఎస్ఎంఈ(MSME) పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటితో పాటు ఇప్పటికే ఉత్పాదన దశలో ఉన్న రూ.25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రెండో దశలో 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులు ప్రారంభించగా,…

Read More
In Prakasam district, two were injured after a car hit a bike near Gonepalli. The driver fled the scene. Police have begun investigation.

గోనేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం కలకలం

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోనేపల్లి మరియు మధవపల్లి గ్రామాల మధ్య శనివారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఓ అజ్ఞాత కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రికి పంపించే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద ఘటనపై…

Read More
An ambulance collided with a motorcycle near Giddalur Chanakya School, leaving the rider seriously injured. He was rushed to the hospital in critical condition.

గిద్దలూరులో అంబులెన్స్ ఢీకొన్న మోటార్ సైకిల్

గిద్దలూరులో చాణక్య స్కూల్ సమీపంలో జాతీయ రహదారిపై భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక అంబులెన్స్ మోటార్ సైకిల్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు వచ్చాయి. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి దారుణంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తక్షణం ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం ప్రకారం, అంబులెన్స్ వేగంగా వెళ్లిపోతుండగా బైక్ సోదరుడు జాతీయ రహదారిపై పయనిస్తున్నాడు. అంబులెన్స్ అదుపు తప్పి బైక్‌ను ఢీకొనడం జరిగింది. ప్రమాదం తీవ్రత…

Read More
In Ardhaveedu, a drunk man attacked his wife with a knife. When son Shakir intervened, he was fatally injured. Police registered a case and are investigating.

మద్యం మత్తులో కుమారుడిని పొట్టన పెట్టుకున్న తండ్రి!

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కాశీం అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని చూసిన అతని కుమారుడు షాకీర్ తల్లి ప్రాణాలను రక్షించేందుకు అడ్డు వచ్చాడు. అవసర పరిస్థితుల్లో తండ్రి పట్టిన కత్తి కుమారుడికే తగలడంతో షాకీర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గాయాల కారణంగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తన కొడుకే తన చేతుల్లో ప్రాణాలు కోల్పోవడం…

Read More
Due to railway track repairs, Jagganbotla Krishnapuram Railway Gate will be closed from the 19th to the 21st, officials announced.

జగ్గంబోట్ల కృష్ణాపురం రైల్వే గేటు 19 నుంచి మూసివేత

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం జగ్గంబోట్ల కృష్ణాపురం స్టేషన్ వద్ద ఉన్న రైల్వే గేటును ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మత్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, భద్రతా పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. రైల్వే గేటు మూసివేత కారణంగా గిద్దలూరు, కంభం, తురిమెళ్ళ, రాచర్ల వైపు ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. స్థానికులు,…

Read More
A youth suffered an electric shock after climbing a goods train at Giddaluru railway station. Further details are awaited.

గిద్దలూరు రైల్వే స్టేషన్‌లో గూడ్స్ ట్రైన్‌పై యువకుడి ప్రమాదం

ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్‌పై ఎక్కిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ పై విద్యుత్ తీగను పట్టుకున్నాడు. దీంతో అతనికి తీవ్రంగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే కింద పడిపోయాడు. ఘటనను గమనించిన స్థానికులు, రైల్వే సిబ్బంది వెంటనే అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. యువకుడి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతని ఆరోగ్యం గురించి…

Read More