విలేకరులపై దాడులు ఖండించిన వామపక్ష నేతలు
బుధవారం పార్వతీపురం సుందరయ్య భవనంలో వామపక్ష పార్టీలు, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సిపిఎం నాయకులు గొర్లి వెంకటరమణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. విలేకరులపై దాడులు పెరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు రెడ్డి వేణు, వి.ఇందిర, సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు, సిపిఐ ఎంఎల్ నాయకులు పి.రమణి, పి.సంఘం, సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ తదితరులు…
