రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు
రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఖరీఫ్ లో 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అందులో 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అనుమతించినట్లు చెప్పారు. ధాన్యం సేకరణలో ముందస్తు ఏర్పాట్లపై జిల్లాస్థాయి ధాన్యం సేకరణ కమిటీ సమావేశం…
