పల్నాడు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ షురూ!
పల్నాడు జిల్లాలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ ఎడ్యుకేషనల్ అధికారి లీలావతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూనియర్ కళాశాలలో అధ్యాపకులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించి, మార్గదర్శకాలను వివరించారు. ఈ సంవత్సరం జిల్లాలో మొత్తం 62 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థుల సంఖ్య 11,509 కాగా, ప్రతి కేంద్రంలో సమర్థవంతమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు….
