పల్నాడు జిల్లాలో రేపటి నుండి ఒంటిపూట బడులు అమలు
పల్నాడు జిల్లాలో రేపటి నుండి ఒంటిపూట బడులను అమలు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి చంద్రకళ ప్రకటించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో మాత్రం పరీక్షలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల…
