
అమరావతి శాశ్వత భవనాల కాన్సెప్ట్ డిజైన్లు – ఆగస్టు 8 నాటికి ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న అమరావతి శాశ్వత రాజధాని కీలక దశను దాటుతోంది. రాజధానిలో నిర్మించబోయే శాశ్వత హైకోర్టు, శాసనసభ భవనం, సచివాలయ టవర్ల డిజైన్ల ఖరారుకు సమయం దగ్గరపడింది. లండన్‌కు చెందిన ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఈ ప్రాజెక్టులకు కన్సెప్ట్ డిజైన్లను తుదిరూపం ఇవ్వనుంది. నిర్మాణాల శరవేగం గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఫోస్టర్స్ సంస్థ ఈ డిజైన్లపై పని మొదలు పెట్టింది. ప్రస్తుతం టెండర్లు పూర్తయ్యాయి. గుత్తేదారులతో కలిసి నిర్మాణ పనులు…