
గవిగట్టు గ్రామంలో బంగారమ్మ మారెమ్మ విగ్రహాల ప్రతిష్ఠ
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం గవిగట్టు గ్రామంలో గ్రామదేవతలుగా పూజించబడే శ్రీ బంగారమ్మ మారెమ్మ దేవతల నూతన విగ్రహాలను గ్రామస్తులు ఘనంగా ఊరేగించారు. గ్రామస్థుల సహకారంతో విరాళాలు సేకరించి నూతన దేవాలయం నిర్మాణం చేపట్టారు. నైపుణ్యంతో కూడిన శిల్పకారులు అమ్మవారి విగ్రహాలను తయారు చేయగా, బుధవారం వాటిని ప్రాణ ప్రతిష్ఠాపన చేయనున్నారు. నూతన విగ్రహాలు గ్రామానికి చేరుకున్న సందర్భంగా, గ్రామస్తులు డప్పుల వాయిద్యాలతో, కళాశాలలతో ఉత్సాహంగా ఊరేగింపుని నిర్వహించారు. శ్రీ బంగారమ్మ మారెమ్మ దేవతలు గవిగట్టు గ్రామానికి…