కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడులు
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూగలదొడ్డి గ్రామంలో బోయ నాగరాజు వద్ద 384 ఒరిజినల్ ఛాయిస్ 90 మిల్లీ లీటర్ల టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఆయన తెలిపారు. ఈ దాడులు అక్రమ మద్యం విక్రయదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు….
