ఆదోనిలో క్రీడల అభివృద్ధికి MLA పార్థసారథి ప్రోత్సాహం
ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదోని సైన్స్ కళాశాల నందు నిర్వహించిన “న్యూ జనరేషన్ యాక్టివిటీస్ 2024-25” కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రోటరీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ విద్యార్థులు చదువు మరియు క్రీడల రెండింటిలోనూ ముందుండాలని, అవి జీవిత విజయానికి ముఖ్యమని చెప్పారు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థులకు శారీరక మరియు మానసిక వికాసం కలిగిస్తాయని, మంచి ఆటగాళ్లుగా ఎదగడానికి అవకాశం…
