కోడూరుపాడులో పూనుగు పిల్లి కలకలం
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో పూనుగు పిల్లి దర్శనం గ్రామస్థులను ఆశ్చర్యంలో ముంచింది. రాత్రి సమయంలో ఇది గ్రామంలో సంచరిస్తుండగా, కొందరు స్థానికులు గమనించారు. జంతువును వలవేసి పట్టుకునేందుకు వారు జాగ్రత్తగా ప్రయత్నించారు. చివరకు పూనుగు పిల్లిని సురక్షితంగా బంధించి భద్రపరిచారు. ఈ ప్రక్రియలో గ్రామస్థురాలు ఆళ్ల భాను కీలక పాత్ర పోషించారు. పూనుగు పిల్లిని పట్టుకున్న అనంతరం ఆమె అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. జంతువు ఎటువంటి గాయాలు కాకుండా జాగ్రత్తగా…
