
గొల్లవిల్లి జాతీయ వాలీబాల్ టోర్నీలో జీఎస్టీ చెన్నై విజయం
అమలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌లో జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా కొనసాగుతోంది. శ్రీ అరిగెల రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్‌లో భాగంగా జీఎస్టీ చెన్నై, ముంబై జట్ల మధ్య ఉత్కంఠ భరిత పోటీ జరిగింది. ఈ మ్యాచ్‌లో జీఎస్టీ చెన్నై విజయం సాధించి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. క్రీడాభిమానులు టోర్నమెంట్‌లోని పోటీలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. జీఎస్టీ చెన్నై జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. జట్టుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా,…