
ఉత్తరాంధ్రలో వర్ష విరళం – రహదారులు మునిగిపోయి రాకపోకలకు అంతరాయం
ఉత్తరాంధ్ర ప్రాంతం వరుణుడి ఆగ్రహానికి అల్లాడిపోయింది. ఎడతెరిపి లేని వర్షాలతో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు చిగురుటాకులా వణికాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షాల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో జీవన వ్యవస్థ అస్థవ్యస్థమైంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం విశాఖ జిల్లా కాపులుప్పాడలో నమోదైంది. అక్కడ ఒక్కరోజులోనే 15.3 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో 25 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో పరిస్థితి తీవ్రతరమైంది….