
కాకినాడ పోర్టు కేసులో కీలక వ్యక్తి విక్రాంత్ రెడ్డి
కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కీలక పాత్రధారి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని తెలిపారు. సీఐడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి, ఈ వ్యవహారంలో ముఖ్య వ్యక్తులు ఎవరో తనకు తెలుసని స్పష్టం చేశారు. కామన్ ఫ్రెండ్ ద్వారా విక్రాంత్ రెడ్డికి కేవీ రావును పరిచయం చేసిన విషయాన్ని ఒప్పుకున్నారు. అయితే, తనకు పోర్టు యజమాని కేవీ రావుతో ఎలాంటి…