
కాకినాడ ఆటోనగర్ ప్లాట్లపై దేవాదాయశాఖ ఇబ్బందులు – ప్లాట్ల యజమానుల ఆవేదన
కాకినాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుండటంతో, మెకానిక్ షెడ్లను తరలించేందుకు నాటి ప్రభుత్వం 1993లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (APIIC) ద్వారా సర్పవరంలో 18 ఎకరాల భూమి సేకరించింది. అనంతరం 2000లో ఏపీఐఐసీ నుండి ప్లాట్లు కొనుగోలు చేసిన వారే ఆటోనగర్‌ను ఏర్పరచుకున్నారు. వాహనాల మరమ్మత్తు షెడ్లు, స్పేర్ పార్టుల దుకాణాలు, చిన్నపాటి పరిశ్రమలు ఏర్పడి వందలాది కుటుంబాలు జీవనోపాధి సాగించాయి. అయితే, ఈ స్థిరాస్తులపై 2016లో పెద్ద సమస్య తలెత్తింది. దాదాపు 7.62…