: Sub-Collector Sanjana Simha confirmed that arrangements for Tenali Graduates MLC elections are complete. Polling on Feb 27, counting on March 3.

తెనాలి గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తీ

తెనాలి గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహా తెలిపారు. శాంతియుతంగా ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో మొత్తం 51 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, మరో 8 కేంద్రాలకు అనుమతి రావాల్సి ఉందని వెల్లడించారు. తెనాలి నియోజకవర్గంలో 23,273 మంది ఓటర్లు ఉండగా,…

Read More
AP Circle Chief Postmaster General Prakash conducted a surprise inspection at Tenali Head Post Office, reviewing records and discussing with officials.

తెనాలి హెడ్ పోస్టాఫీసులో చీఫ్ పోస్ట్ మాస్టర్ తనిఖీ

శనివారం ఉదయం తెనాలి కొత్తపేటలోని హెడ్ పోస్టాఫీసును ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రకాశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన సందర్శనలో భాగంగా కార్యాలయ ఆవరణలో స్వచ్ఛతను పరిశీలించి, సేవల నాణ్యతను పర్యవేక్షించారు. పోస్టాఫీస్‌లో ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో సమావేశమైన ఆయన, పోస్టల్ రికార్డుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. సూపరింటెండెంట్ సహా ఇతర అధికారుల నుండి పలు వివరాలు సేకరించారు. లావాదేవీల నాణ్యత, సేవల వేగం, వినియోగదారులకు కలుగుతున్న…

Read More
Officials seized 20 quintals of illegally stored ration rice in Kollipara. Investigation is underway.

కొల్లిపరలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత!

కొల్లిపర మండలం దంతులూరులో భారీగా రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. మరియమ్మ అనే మహిళ తన ఇంటి వెనుక 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం దాచివుంచారని స్థానికులు అనుమానంతో రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచడంపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదించడంతో మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. బియ్యాన్ని ఎలా సేకరించారు?…

Read More
Police conducted a sudden cordon search in Tenali Sultanabad early morning and detained suspects for questioning.

తెనాలి సుల్తానాబాద్‌లో పోలీసుల ఆకస్మిక కాటన్ సెర్చ్

తెనాలి పట్టణంలోని సుల్తానాబాద్, సుగాలి కాలనీ, వడ్డెర కాలనీ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక కాటన్ సెర్చ్ నిర్వహించారు. అదనపు ఎస్పీ ఏవి రమణమూర్తి, డీఎస్పీ జనార్దనరావు, 3 టౌన్ సీఐ రమేష్ బాబు నేతృత్వంలో భారీగా పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి పోలీసులు నేరచరిత్ర ఉన్న వారిని పసిగట్టి విచారణ చేపట్టారు. ఈ తనిఖీల్లో అనేక మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి…

Read More
Illegal sand mining is happening in Kollipara mandal, violating norms. Heavy machinery is used, and sand is transported via heavy tippers.

కొల్లిపరలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు

కొల్లిపర మండలం కొత్త బొమ్మువానిపాలెంలోని ఇసుక రీచ్ లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నదిలో కూలీలతోనే తవ్వకాలు జరిపి, ట్రాక్టర్లతో తరలించాలన్న నిబంధనలను అప్రయత్నంగా ఉల్లంఘిస్తున్నారు. అక్రమార్కులు భారీ యంత్రాలను వినియోగించి ఇసుక తవ్వకాలు జరిపి, హెవీ టిప్పర్ల ద్వారా రాత్రిపగలు తరలిస్తున్నారు. దీంతో పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదీ తీర ప్రాంతాల్లో నీటి మట్టం పడిపోవడం, జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి….

Read More