నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ బాధతో యువకుడు బలి
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. కనుపోలు ఉదయ్ కిరణ్ (32) అనే యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై పది లక్షల రూపాయలకు పైగా కోల్పోయినట్టు సమాచారం. ఉదయ్ కిరణ్ కుటుంబానికి ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదని తెలుస్తోంది. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న అతను, ఆన్లైన్ బెట్టింగ్ వల్ల అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పుల బాధ తట్టుకోలేక మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని…
