
మంగళగిరిలో కాలేజీ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
మంగళగిరి మండల పరిధిలో కాలేజీ యువకులను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ముఠాను గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. గ్రామీణ సీఐ వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ, కాజా గ్రామంలో యువకులు గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం అందిన వెంటనే నిఘా ఉంచి, నంబూరు కెనాల్ వద్ద 9 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతుందని…