
గుంటూరులో నకిలీ నోట్లు కలకలం – జంట అరెస్టు, పెద్ద ముఠా అనుమానం
గుంటూరులో నకిలీ నోట్ల చెలామణీ మరోసారి కలకలం రేపింది. తాజాగా పట్టాభిపురం ప్రాంతంలో జరిగిన ఘటనలో దంపతులు గోపిరెడ్డి, జ్యోతి నకిలీ 500 రూపాయల నోట్లతో వ్యాపారులను మోసం చేసే ప్రయత్నంలో పట్టుబడ్డారు. నగరంలోని రత్నగిరి కాలనీలో నివాసం ఉంటున్న ఈ దంపతులు గురువారం రాత్రి పట్టాభిపురం ప్రధాన రహదారిలోని చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. మొదట వారు ఒక తోపుడు బండిపై శనక్కాయలు కొనుగోలు చేస్తూ 100 రూపాయల వస్తువుకు 500 రూపాయల నకిలీ నోటు…