జీలుగుమిల్లిలో అగ్ని ప్రమాదం.. రైతును పరామర్శించిన ఎమ్మెల్యే!
జీలుగుమిల్లి మండలం పాకల గూడెం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సరియం ముత్యాలరావు అనే రైతు సుమారు 6 ఎకరాల పామాయిల్ తోట మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఈ ఘటనపై స్పందించి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ముత్యాలరావును పరామర్శించి ఆయన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. రైతుల కష్టాలను ప్రభుత్వం అర్థం…
