పలమనేరులో 4000 ఉద్యోగాలకు టెక్స్‌టైల్ హబ్
గంగవరం మండలంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్‌లో పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపూర్‌కు చెందిన ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్ గ్లోబల్ క్లాథింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్‌టైల్ పరిశ్రమను పలమనేరు పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 4,000 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలోని ఐకేపి మహిళల కోసం ప్రత్యేకంగా ఈ అవకాశాలను రూపొందించినట్టు తెలిపారు….
