
ఉత్తరాంధ్రలో వర్షం బీభత్సం – రాకపోకలు స్తంభన, ప్రజలు ఆందోళన
ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. కురిసిన భారీ వర్షాలతో వాగులు, గెడ్డలు, చిన్నా పెద్ద నదులు పొంగిపొరలుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పర్వత ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అల్లూరి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పెదబయలు – పాడేరు మండలాల మధ్య ఉన్న పరదానిపుట్టు వంతెనపై వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. దీంతో దాదాపు 60 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పాడేరు…