ఇసుక కోసం చేపడుతున్న శాంతి ర్యాలీకి ప్రజలు తరలి రావాలని పిలుపు… భావన కార్మికులకు వెంటనే ఇసుకను సరఫరా చేయాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే (Former MLA) ఉమా శంకర్ గణేష్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన క్యాంప కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన వైసిపి నాయకులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చినట్టుగా ఇసుకను ఉచితంగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు.ఐదువేల మంది కుటుంబాలు,భవన కార్మికులు మూడు నెలల నుంచి పస్తులు ఉన్నారని, వాటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఇసుక సరఫరా చేయాలని కోరారు. ఈనెల 21వ తారీఖున చేపడుతున్న శాంతి ర్యాలీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,భవన కార్మికులు తరలి రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రాపాత్రుడు, డాక్టర్ లక్ష్మీకాంత్, మున్సిపల్ చైర్మన్ సుబ్బలక్ష్మి, మున్సిపాలిటీ నాయకులు, నాలుగు మండలాల ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇసుక సరఫరా కోసం శాంతి ర్యాలీకి పిలుపు
