Bomb Threats: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)కు మరోసారి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. వరుసగా వస్తున్న ఫేక్ బాంబు బెదిరింపులతో భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి.
భద్రతా చర్యలు
బెదిరింపు మెయిల్ అందిన వెంటనే విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహా ప్రత్యేక బృందాలు అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. పూర్తిస్థాయి తనిఖీల అనంతరం ఇది ఫేక్ బాంబు బెదిరింపుగా భద్రతా సిబ్బంది నిర్ధారించారు.
28 ఫేక్ మెయిల్స్ నమోదు
ఈ ఏడాది ఒక్క శంషాబాద్ ఎయిర్‌పోర్టుకే ఇప్పటివరకు 28 బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ అన్ని ఘటనలపై RGIA పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే 28 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ALSO READ:Tollywood Controversy | శివాజీ వ్యాఖ్యలకు సింగర్ చిన్మయి స్ట్రాంగ్ రియాక్షన్
సైబర్ క్రైమ్‌కు కేసుల బదిలీ
వరుస ఫేక్ మెయిల్స్ నేపథ్యంలో లోతైన దర్యాప్తుకు RGIA పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయాలని నిర్ణయించారు. డార్క్ వెబ్‌ను ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫేక్ మెయిల్స్ పంపుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
పోలీసుల హెచ్చరిక
ఫేక్ బాంబు బెదిరింపులు తీవ్ర నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
