నవంబర్ 8న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా సూర్య భాయ్ యూత్ ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని సూర్య భాయ్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం సురేందర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ , డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు , మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి , కౌన్సిలర్ లు సూర్య భాయ్ యూత్ యూవకులు భారీ ఎత్తున వచ్చి రక్తదానం చేయవలసిందిగా మీ చుట్టాలు ఉన్న వారికి కూడా తెలుపగలరని , ఎందుకంటే తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నరుల కోసం రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాలను రక్షించడం కోసం సూర్య భాయ్ యూత్ యువకులు రక్తదానం చేయాలి అని సూర్య భాయ్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం సురేందర్ రెడ్డి మీడియా సమావేశం లో తెలిపారు.