Betting Apps Case | సీఐడీ ఎంక్వయిరీ క్లోజ్.. తదుపరి చర్యలు ఏంటి?

CID officials questioning celebrities in betting apps case CID officials questioning celebrities in betting apps case

Betting Apps Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్‌ల కేసులో సీఐడీ విచారణ నేటితో ముగిసింది. యాప్‌ల ప్రమోషన్‌లో భాగంగా పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లను సీఐడీ అధికారులు విచారించారు.

చివరి రోజు విచారణ

విచారణ చివరి రోజున బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రీతూ చౌదరి, నటి మంచు లక్ష్మి, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌లను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. రెండు గంటలకు పైగా సాగిన విచారణలో వారి స్టేట్‌మెంట్లు నమోదు చేశారు.

మునుపటి విచారణలు

ఇదే కేసులో ఇప్పటికే నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్లు శ్రీముఖి, విష్ణుప్రియ, నటి అమృత చౌదరి గతంలో సీఐడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రమోట్ చేశారు, అందుకు తీసుకున్న పారితోషికం ఎంత, యాప్ నిర్వాహకులతో చేసిన ఒప్పందాల వివరాలపై అధికారులు ఆరా తీశారు.

ALSO READ:Kondagattu Temple | దేవాదాయ…అటవీ శాఖల మధ్య భూవివాదం

ఎఫ్ఐఆర్ల ఆధారంగా కేసులు

బెట్టింగ్ యాప్‌లకు బానిసై యువత ఆర్థికంగా నష్టపోయి, అప్పుల్లో కూరుకుపోయిన ఘటనలపై పలు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకొని మొత్తం 25 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై సీఐడీ కేసులు నమోదు చేసింది.

వాట్ నెక్స్ట్?

విచారణ ముగియడంతో సీఐడీ ఇప్పుడు తుది నివేదిక ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేయనుంది. ఈ రిపోర్ట్‌లో ఎవరి పాత్ర ఎంత వరకు ఉందన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తదుపరి న్యాయపరమైన చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *