మదర్స్ లవ్ ఫౌండేషన్, జీఈవో (గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజషన్) సంయుక్తంగా శనివారం ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు ఉర్లం.శివతేజ మాట్లాడుతూ, ప్రజలందరూ గుడ్డ (జూట్) సంచులను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా గోనె సంచుల వాడకం ప్రతీ ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ప్రభుత్వాల పాత్ర కన్నా ప్రజల భాగస్వామ్యం మరింత ముఖ్యమైనది అని చెప్పారు. ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు గోనె సంచిని తీసుకోవడం, ఆరోగ్యకరమైన సమాజానికి మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. ప్రజలతో కలిసి ఈ మార్పును ప్రారంభించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మదర్స్ లవ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుప్రజ రౌత్, జీఈవో అధ్యక్షులు సద్గుణ, సాయి బాబా ఈవెంట్స్ బాబా, తదితరులు పాల్గొన్నారు. వారు రాష్ట్రపండుగ సందర్భంగా భక్తులు ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచులను ఉపయోగించాలన్నారు.
కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్, మదర్స్ లవ్ ఫౌండేషన్ సభ్యులు, జీఈవో సభ్యురాలు సంతోషిణి, పొడుగు.చరణ్, వాన.జ్యోతి తదితరులు గుడ్డు సంచులను పాదచారులకు అందించి అవగాహన కల్పించారు.
