ఎమ్మిగనూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన

An awareness program on SC/ST Atrocities Act was conducted by CID at Vaishnavi Degree College, Emmiganur, with DSP Upendra Babu as the chief guest. An awareness program on SC/ST Atrocities Act was conducted by CID at Vaishnavi Degree College, Emmiganur, with DSP Upendra Babu as the chief guest.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వైష్ణవి డిగ్రీ కళాశాల నందు సిఐడి పోలీసుల ఆధ్వర్యంలో ఎస్సీ ,ఎస్టీ, అట్రాసిటీ కేసులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు డిఎస్పి ఉపేంద్ర బాబు పాల్గొన్నారు.
ముందుగా వైష్ణవి డిగ్రీ కళాశాల చైర్మన్ గడిగే లింగప్ప డి.ఎస్.పి ఉపేంద్ర బాబుకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.అనంతరం డిఎస్పి ఉపేంద్ర బాబు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. అవగాహన ఉంటే సమాజంలో నడవడిక ధోరణి సక్రమంగా ఉంటుందన్నారు. ఒక నేరం చేస్తే దాని పర్యవసానం ఏమిటని అర్థమవుతుందన్నారు. సిఐడి డిఎస్‌పి భూపాల్‌ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టిలపై దాడి చేస్తే సదరు బాధితుడికి ఎస్‌సి, ఎస్‌టి పిఒఎ చట్టం ఏ విధంగా రక్షణ కల్పించి, న్యాయం చేస్తుంది, బాధితుడికి ఎటువంటి శిక్ష అవుతుంది, ఇటువంటి కేసుల్లో కోర్టులు, పోలీస్‌ అధికారులు ఏ విధంగా కేసు నమోదు చేస్తారు అంశాలను వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *