సనాతన ధర్మ పరిరక్షణార్థం ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు సందర్భంగా జియ్యమ్మవలస మండల కేంద్రంలో శివాలయం వద్ద మండల జనసైనికుల ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను మన్నించాలని కోరుతూ భజన కార్య్రమంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన ఐటీ కోఆర్డినేటర్ ఎల్ రంజిత్ కుమార్ జియ్యమ్మవలస మండల నాయకులు రాజేష్, శ్రీను, రిషిబాబు,పోల్ నాయుడు,భార్గవ్,రాజు, సత్య, గణేష్, నరేష్, వినోద్, సింహాచలం మరియు గ్రామ పెద్ధలు & భక్తులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ధర్మాన్ని మనం కాపాడాలి అలానే అన్ని మతస్తులను గౌరవించాల్సిన బాధ్యత ఉందని , వారి మనోభావాలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని తెలిపారు.