శరన్నవరాత్రులను పురస్కరించుకుని విజయదశమి అనంతరం ఈనెల 16న అంబాజీపేట లో నిర్వహించే భేతాళ ఉత్సవాన్ని పూర్తి సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుందామని కొత్తపేట డి.ఎస్.పి వై గోవిందరావు ఉత్సవ కమిటీకి సూచించారు.స్థానిక పెద్ద వీధిలో ఉన్న ఏవీఆర్ గ్రాండ్ మినీ ఏసీ కల్యాణ మండపంలో పి. గన్నవరం సిఐ ఆర్ భీమరాజు అధ్యక్షతన ఉత్సవ కమిటీ తో సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న డి.ఎస్.పి గోవిందరావు మాట్లాడుతూ వాహన నిర్వాహకులు తమ తమ వాహనాలను సక్రమంగా తీసుకుని రావాలని, వాహనాల వివరాలు ఇవ్వాలన్నారు.వాహనాలను నడిపే డ్రైవర్లకు తప్పకుండా లైసెన్సులు ఉండాలన్నారు. ప్రతి వాహనం నుండి నలుగురు కమిటీ సభ్యుల పేర్లను ఇవ్వాలని,వాహనాల వద్ద ఉండే వాలంటీర్లకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉండాలని సూచించారు.
ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు, రికార్డింగ్ డాన్సులకు ఎట్టి పరిస్థితుల్లో తావు లేదని డి.ఎస్.పి హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు యువకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.శ్రీ శెట్టిబలిజ, అభ్యుదయ సంక్షేమ సంఘ అధ్యక్షులు దొమ్మేటి రామారావు , ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శీలం సత్య అర్జున మోహన్ రావు మాట్లాడుతూ గత 58 ఏళ్లుగా భేతాళ ఉత్సవాన్ని ఎంతో సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా పూర్తి సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్సై కె. చిరంజీవి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
భేతాళ ఉత్సవానికి పూర్తి సాంప్రదాయ బద్ధంగా ఏర్పాట్లు
