AP Weather Alert: రైతులకు కీలక హెచ్చరిక…అండమాన్లో తీవ్ర అల్పపీడనం

AP weather alert with rainfall forecast for multiple districts and advisory for farmers AP weather alert with rainfall forecast for multiple districts and advisory for farmers

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వాతావరణ మార్పులతో రైతులను భయాందోళనకు గురిచేస్తుంది. మళ్ళి వర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిచే అవకాశం ఉందని APSDMA తెలిపింది.

ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండగా, ఇది రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ALSO READ:West Bengal Elections 2025: మమతా బెనర్జీకి గట్టి సవాల్‌గా మారిన బీజేపీ 

కోత పనులు త్వరగా పూర్తి చేసి ధాన్యాన్ని తడవకుండా రక్షించుకోవాలని, ఎరువులు లేదా పురుగుమందులు వాడే సమయంలో వాతావరణ పరిస్థితులను గమనించాలని సూచించారు.

వర్షాలు పడే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని పంటలకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఏవైనా వాతావరణ మార్పులు వచ్చిన వెంటనే అలర్ట్ ఇస్తామని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *